‘ఎస్‌బీఐ కార్డ్’లో కొత్త భాగస్వామి
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి వచ్చే మూడు నెలల్లో కొత్త భాగస్వామిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని బ్యాంకు తెలిపింది.
	ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి వచ్చే మూడు నెలల్లో కొత్త భాగస్వామిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని బ్యాంకు తెలిపింది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఎస్‌బీఐ కార్డు వ్యాపార భాగస్వామిగా ఉండగా, తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
	
	ఈ నేపథ్యంలో కొత్త జాయింట్ వెంచర్ భాగస్వామిని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఎస్‌బీఐ ఎండీ దినేష్‌కుమార్ ఖరా వెల్లడించారు. జీఈ తప్పుకుంటే ఎస్‌బీఐ కార్డ్ వ్యాపారంలో ఎస్‌బీఐ వాటా 74 శాతానికి పెంచుకుంటుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
