హైఎండ్‌ శాంసంగ్‌ ఫోన్‌పై ధర తగ్గింపు | Samsung Galaxy S7 Edge Price in India Slashed | Sakshi
Sakshi News home page

హైఎండ్‌ శాంసంగ్‌ ఫోన్‌పై ధర తగ్గింపు

Feb 23 2018 4:37 PM | Updated on Jul 6 2019 3:18 PM

Samsung Galaxy S7 Edge Price in India Slashed - Sakshi

గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌

హైఎండ్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌పై భారత్‌లో ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆరు వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ 32జీబీ వేరియంట్‌ రూ.35,900కు, 128జీబీ వెర్షన్‌ రూ.37,900కు అందుబాటులోకి వచ్చాయి. ఆఫ్‌లైన్‌ ఛానల్స్‌లో మాత్రమే ఈ తగ్గింపుతో గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కేవలం 32జీబీ వేరియంట్‌పై మాత్రమే ధర తగ్గింది. 128జీబీ వేరియంట్‌ పాత ధరకే లభ్యమవుతోంది. 

 2016 ఆగస్టులో ఈ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ వేరియంట్‌ ధర 50,900 రూపాయలు, 128జీబీ వేరియంట్‌ ధర 56,900 రూపాయలు ఉంది. అనంతరం ఈ ఇరు వేరియంట్లపై కూడా ధర తగ్గించి రూ.41,900కు, రూ.43,900కు శాంసంగ్‌ అందుబాటులోకి తెచ్చింది. మరోసారి ప్రస్తుతం వీటిపై ఆరు వేల రూపాయల మేర ధర తగ్గించింది. ఆశ్చర్యకరంగా గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ధరలు తగ్గించిన అనంతరం వెంటనే హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ అయిన గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌పై కూడా ధర శాంసంగ్‌ ధర తగ్గించింది. గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ను ఎండ్ల్యూసీ 2016లో శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. 

గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ ఫీచర్లు..
ఆండ్రాయిడ్‌ నోగట్‌
5.5 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ 8890 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
12 ఎంపీ డ్యూయల్‌ పిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
200టీబీ వరకు విస్తరణ మెమరీ
3600ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement