
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరంలో సాక్షి ప్రాపర్టీ షో కూత పెట్టనుంది. నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 16, 17 తేదీల్లో కూకట్‌పల్లిలోని శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో ప్రాపర్టీ షో జరగనుంది.
నగరానికి చెందిన 25కి పైగా నిర్మాణ సంస్థలు పాల్గొనే ఈ స్థిరాస్తి ప్రదర్శనకు ప్రధాన స్పాన్సర్‌గా అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, అసోసియేట్ స్పాన్సర్లుగా రాంకీ, ఆదిత్య, గ్రీన్‌మార్క్ డెవలపర్స్, కో–స్పాన్సర్‌గా ప్రణీత్ గ్రూప్ వ్యవహరించనున్నాయి. స్టాల్ బుకింగ్, ఇతరత్రా వివరాల కోసం 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.