Sakshi News home page

దక్షిణ కొరియా కేంద్ర బ్యాంకు సంచలన నిర్ణయం

Published Thu, Jul 13 2017 10:04 AM

దక్షిణ కొరియా కేంద్ర బ్యాంకు సంచలన నిర్ణయం

సియోల్‌: దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్ తన బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను రికార్డ్‌ స్థాయిల వద్ద నిలిపింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ కొరియా తన  వడ్డీ రేట్లను భారీగా స్తంభింపచేసింది. వరుసగా 13 నెలలో కూడా  పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత వడ్డీరేట్లు రికార్డు కనిష్టాన్ని నమోదు  చేశాయి.

బీవోకే గవర్నర్ లీ జు-యూయోల్,  మిగిలిన ఆరు ద్రవ్య విధాన బోర్డు సభ్యులు 1.25 శాతంగా  (ఏడురోజులు  రీపర్చేజ్‌) నిర్ణయించారు. గత ఏడాది జూన్ నాటి స్థాయికి ప్రస్తుత వడ్డీ  రేట్లను బ్యాంక్‌ తగ్గించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

కొరియా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్, 200మంది స్థిర-ఆదాయ నిపుణుల సర్వే ప్రకారం  రేటు ఫ్రీజ్  ఉంటుందని 98 శాతం మంది అంచనా వేశారు. అటు బీవోకే రేటు పెంపు ఆవశకత్యపై ఇటీవల సంకేతాలిచ్చింది.  అయితే అమెరికా గత నెలలో ఫెడరల్ రిజర్వ్  బెంచ్‌ మార్క్‌ రేటును   1.00-1.25 శాతం పెంచడంతో బీవోకేపై ఒత్తిడి పెరిగినట్టు అంచనా.
 
ఫెడ్ దాని పాలసీ రేట్లను మరింత పెంచితే  దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్ నుంచి విదేశీ  పెట్టుబడులు  బహుశా బయటికి వెళ్లిపోతాయని, దీంతో ప్రపంచ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ అని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఊహాత్మక పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో తనఖా రుణాలపై  ప్రెసిడెంట్ మూన్ జాయె ఆధ్వర్యంలోని  కొత్త ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement