రూపాయికీ ప్యాకేజీ వార్తల జోష్‌

Rupee rebounds 15 paise to 71.66 against USD - Sakshi

72 దాటినా... చివరకు బలం

15 పైసలు లాభంతో 71.66 వద్దకు రూపాయి

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మొట్టమొదటిసారి 72 దిగువకు పడిపోయింది. అయితే చివరకు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం ముగింపుతో పోల్చిచూస్తే, 15 పైసలు బలపడి 71.66 వద్ద ముగిసింది. ఎఫ్‌పీఐ పారిన్‌ పోల్టిఫోలియో ఇన్వెస్టర్లపై సర్‌చార్జ్‌ తీసివేస్తారని, వృద్ధికి దోహదపడే చర్యలను ప్రభుత్వం ప్రకటించనుందని వచ్చిన వార్తలు, ఈ వార్తలతో లాభాల బాటన నడిచిన ఈక్విటీ మార్కెట్లు రూపాయిని బలోపేతం చేశాయి.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సాయంత్రం పత్రికా సమావేశంలో ప్రసంగించనున్నారన్న ప్రకటన అటు ఈక్విటీ మార్కెట్లను ఇటు ఫారెక్స్‌ మార్కెట్‌ను ఒడిదుడుకుల బాటనుంచి స్థిరీకరణ దిశగా నడిపించాయి. అంతర్జాతీయంగా కీలక స్థాయికన్నా దిగువున  ఉన్న క్రూడ్‌ ధరలూ రూపాయి సెంటిమెంట్‌కు కొంత బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు.  గురువారం రూపాయి ఎనిమిది నెలల కనిష్టం 71.81 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం టేడింగ్‌ మొదట్లో బలహీనతలోనే 71.93 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 72.05ను తాకింది. 71.58 గరిష్టస్థాయిని నేటి ట్రేడింగ్‌లో రూపాయి చూసింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top