డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది | Rolls-Royce unveils its first driverless car | Sakshi
Sakshi News home page

డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది

Published Fri, Jun 17 2016 4:33 PM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది - Sakshi

డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది

సూపర్ లగ్జరీ కారు మార్కెట్లో రోల్స్ రాయిస్ మరోసారి తళుక్కుమంది. తన మొదటి డ్రైవర్ లెస్ కారును గురువారం ఆవిష్కరించేసింది.

సూపర్ లగ్జరీ కారు మార్కెట్లో రోల్స్ రాయిస్ మరోసారి తళుక్కుమంది. తన మొదటి డ్రైవర్ లెస్ కారును గురువారం ఆవిష్కరించేసింది.  సులువైన ప్రయాణం, గ్రాండ్ సాన్చురీ, గ్రాండ్ అరైవల్ అనుభూతితో ఈ కారును జర్మన్ కార్ మేకర్ బిలినీయర్ల ముందుకు తెచ్చింది. ఆ కారుకు అసలు స్టీరింగ్ వీల్  ఉండదు. కేవలం ఒక్క వైపు మాత్రమే డోర్ ఉంటుంది.  కేవలం రెండే సీట్లతో.. చూడగానే చూపరులను కట్టిపడేసేలా వినూత్నంగా  ఈ కారును రోల్స్ రాయిస్ రూపొందించింది. వర్చ్యువల్ అసిస్టెంట్ తో హోటల్స్  బుక్ చేసుకోవడం లేదా వార్డ్రోబ్ ను సెలక్ట్ చేసుకోవడం అంతా ఈ కారు ద్వారానే చేసుకోవచ్చట. ఇప్పటికే చాలా కారు తయారీదారి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించాయి. కానీ రోల్స్ రాయిస్ మాత్రం మొదటిసారి ఈ కారును  వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఈ కారు ధర దాదాపు రూ.10 కోట్లని అంచనా.

న్యూ విజన్ 100 కాన్సెప్ట్ తో ఈ కారును రోల్స్ రాయిస్ తీసుకొచ్చింది. తన పేరెంట్ కంపెనీ బీఎమ్ డబ్ల్యూ సెంటనరీ వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో లండన్ ఈవెంట్ గా 103ఈఎక్స్ పేరుతో ఈ లగ్జరీ కారును రోల్స్ రాయిస్ ప్రవేశపెట్టింది. 3ఎంపీహెచ్ టాప్ స్పీడ్ సామర్థ్యం, మొబైల్ ఫోన్ తోనే ఈ కారును డ్రైవర్ ఆపరేట్ చేయడం దీని ప్రత్యేకతలు. 12 సిలిండర్ ఇంజిన్ ను ఈ కారు కలిగిఉంది. ప్రస్తుతమైతే జీరో ఉద్గారాలు ఉన్నాయని, కానీ 2040లో ఉత్పత్తి అయ్యే కార్లలో మాత్రం ఉద్గారాలు ఉండవు అనే దానికి తమ దగ్గర ఎలాంటి క్లారిటీ లేదని ఈ కొత్త జర్మన్ కారు తయారీదారు పేర్కొంది.

ఈ కారుకు డోర్ కేవలం ఒక్క వైపు మాత్రమే ఉండి, లేజర్ ప్రొజెక్టర్ ద్వారా ఈ కారు వచ్చేటప్పుడు ఫ్లోర్ పై వర్చ్యువల్ రెడ్ కార్పెట్ కనిపిస్తూ గ్రాండ్ వెల్ కమ్ అనుభూతిని కల్పిస్తుంది. అంతేకాదు లగేజీ బ్యాగ్ లను నియంత్రించే పనిని మనం ఏ మాత్రం   టచ్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఈ కారే చేసేస్తుంది. 1.5 మీటర్ స్క్రీన్ తో ఫిల్మ్ లను వీక్షిస్తూ గ్రాండ్ సాన్చురీ అనుభూతిని రోల్ రాయిస్ కల్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement