రిషద్‌ ప్రేమ్‌జీకి పదవీ గండం?!

Rishad Premji May Lose Executive Chairman Role - Sakshi

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌ జీ త్వరలోనే తన పదవిని కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సెబీ (స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ) నియమాల ప్రకారం..ప్రధమ శ్రేణి (5000 కంపెనీల) చైర్మన్‌, సీఈవోలు వేరు వేరు వ్యక్తులు ఉండాలన్న నిబంధన ఈ ఏడాది  ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. విప్రో మాత్రం రిషద్‌నే కొనసాగించాలని సెబీని కోరనుంది. సెబీ కొత్త నియమాల ప్రకారం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌నే  బోర్డు చైర్‌పర్సన్‌గా నియమించాలి. 

మరోవైపు ప్రాక్సీ అడ్వైజరీ సర్వీసస్‌ ఎండీ శ్రీరాం సుబ్రహ్మణియన్‌ స్పందిస్తూ..రిషద్‌కు రెండు ప్రత్యామ్నాలున్నాయని..ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ పదవిని వదులుకుంటే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, జాయింట్‌ ఎండీ పదవులను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. తాజా సెబీ నిమయాల ప్రకారం ప్రమోటర్లకు 74 శాతం షేర్లు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోలేరు. కాగా విప్రో షేర్స్‌ను అజీమ్‌ ప్రేమ్‌జీ పౌండేషన్‌కు ఇచ్చినప్పటికి.. ఓటింగ్‌ హక్కులు కలిగి ఉంటారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. మరోవైపు గత సంవత్సరం రిషద్‌ తండ్రి అజీమ్‌ ప్రేమ్‌ జీ తప్పుకోవడంతో రిషద్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా కొనసాగుతారు.
చదవండి: విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top