ఎయిర్‌టెల్‌ కాదు.. జియోనే టాప్‌

Reliance Jio tops 4G download speed chart in September: TRAI - Sakshi

డౌన్‌లోడ్‌ వేగంలో జియో టాప్‌: ట్రాయ్‌

 ఎయిర్‌టెల్‌ టాప్‌: ప్రయివేట్‌ సంస్థ ఓపెన్‌ సిగ్నల్‌

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం జియో ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ వేగంలో మరోసారి తనస్థానాన్ని నిలబెట్టుకుంది.భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 సెప్టెంబర్‌లో సెకనుకు 21 మెగాబైట్ల సగటు డేటా డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. భారతి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 8.3 ఎంబీపీఎస్‌ను నమోదు చేసింది. వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్‌, ఐడియా సెల్యులార్ 6.4 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగాన్నినమోదు చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. వొడాఫోన్‌, ఐడియాలు విలీనమైనప్పటికీ నెట్‌వర్క్‌ల విషయంలో వేర్వేరుగానే ఉండటంతో వాటి వేగాలను కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తోంది  ట్రాయ్‌. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 3జీ మాత్రమే కలిగి ఉంది. అప్‌లోడ్‌ విషయానికి వస్తే 5.4 ఎంబీపీఎస్‌తో ఐడియా, 5.2 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌ కంపెనీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 4.2 ఎంబీపీఎస్‌తో జియో మూడో స్థానంలో ఉండగా, 3.1 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

ఇది ఇలా వుంటే ప్రైవేట్‌ మొబైల్‌ డేటా అనలిటిక్స్‌ సంస్థ  'ఓపెన్‌ సిగ్నల్‌'  లెక్కలప్రకారం ఎయిర్‌టెల్‌ డౌన్‌ లోడ్‌ వేగంలో టాప్‌లో ఉంది. టెలికాం కంపెనీల ఇంటర్నెట్‌ వేగ గణన సర్వే వివరాలను నిన్న(అక్టోబర్ 22, మంగళవారం) వెల్లడించింది. 2019 జూన్‌-ఆగస్టు కాలానికి ఎయిర్‌టెల్‌ కంపెనీయే అత్యధిక స్పీడ్‌ను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే ట్రాయ్‌ సర్వేలో మాత్రం జియోనే మళ్లీ మొదటి స్థానంలో రావడం గమనార్హం. మై స్పీడ్‌ అప్లికేషన్‌ ఆధారంగా ట్రాయ్‌ ఇంటర్నెట్‌ సరాసరి వేగాల్ని గణించే విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top