
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ జ్యుయల్స్ సరికొత్త డిజైనర్ బంగారు ఆభరణాలను విడుదల చేసింది. 'ఆశ్య-ఐ యామ్ దట్' పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన జ్యుయల్లరీని లాంచ్ చేసింది. తమ 10 ఏళ్ల వేడుకలకు పొడిగింపుగా ప్రఖ్యాత డిజైనర్ గరిమా మహేశ్వరి రిలయన్స్ కోసం ప్రత్యేకంగా వీటిని డిజైన చేసినట్టు రిలయన్స్ జ్యుయల్స్ ప్రకటించింది. సమకాలీన డిజైన్లలో సంప్రదాయ భారతీయ హస్తకళా నైపుణ్యంతో పలు డిజైన్లను మహిళలకోసం అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఏ సందర్భానికైనా, తమ ప్రతీ డిజైన్ ఆధునిక మహిళ మనసు దోచుకుంటుందని పేర్కొంది.
ఆధునిక భారతీయ మహిళల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని తమ ఆభరణాలను రూపొందించామని రిలయన్స్ జ్యుయల్స్ సిఈఓ సునీల్ నాయక్ ప్రకటించారు. సమకాలీన రూపకల్పనలతో సాంప్రదాయిక చిహ్నాల మేళవింపులతో అలరిస్తున్న తమ ఆభరణాలు నేటి డైనమిక్ భారతీయ మహిళలకు తప్పక నచ్చుతాయని విశ్వసిస్తున్నామని తెలిపారు. దేశ్యావ్యాప్తంగా గా ప్రత్యేకంగా రిలయన్స్ జ్యువెల్లస్ షోరూంలలో ఇవి లభిస్తాయని చెప్పారు.
అందమైన హంసకు దగ్గరగా పోలిక ఉండేలా 'ఆశ‍్య’ పేరుతో ఈ అద్భుతమైన కలెక్షన్‌ను అందిస్తోంది. అందమైన, స్వతంత్రమైన, ధీరరాలైన ఆధునిక మహిళకు ప్రతిబింబంగా హంసను భావిస్తారు.