
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతుంది. నేటితో రిలయన్స్ ఇండస్ట్రీస్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేవి ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో గ్రాండ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. మొత్తం 50వేల మందికి సరిపడ ఈ పార్క్ ఉంది. 3 గంటల వ్యవధి కంటే ఎక్కువ సేపు జరుగబోయే ఈ ఫంక్షన్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌లు సందడి చేయనున్నారు. వీరితో పాటు వరుణ్ ధావన్, అలియా భట్, సోను నిగమ్‌లు పాలు పంచుకోనున్నారు.0అయితే ముఖేష్ అంబానీ నిర్వహించబోయే ఈ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే జియో లాంటి కంపెనీలతో దూసుకెళ్తున్న రిలయన్స్ గ్రూప్, భవిష్యత్తు ప్రణాళికలను నేడు వెలువరచనుందని తెలుస్తోంది. అంబానీ కవలలు ఇషా, ఆకాశ్ అంబానీలతో పాటు అంబానీ చిన్న కొడుకు అనంత్ కూడా ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువబోతున్నారు. అంబానీ తర్వాత జనరేషన్, వారి భవిష్యత్తు ప్రణాళికలు ఈ ఈవెంట్‌లో భాగం కాబోతున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి.