మాసివ్‌ అప్‌డేట్‌తో రెడ్‌మి 7, జియో బంపర్‌ ఆఫర్‌

Redmi 7  Launched  in India  - Sakshi

రెడ్‌మి సిరీస్‌లో భాగంగా రెడ్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి బుధవారం లాంచ్‌ చేసింది. ఇన్‌బిల్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, స్పెషల్‌ డిజైన్‌తో  లూనర్‌ రెడ్‌,  కమెంట్‌ బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో ఆవిష్కరించింది.  రెడ్‌మి 6 తో పోలిస్తే  స‍్క్రీన్‌, కెమెరా, బ్యాటరీ తదితరవాటిల్లో  అద్భుతమైన  అప్‌డేట్స్‌తో  రెడ్‌మి 7 లాంచ్‌ చేసినట్టు  షావోమి ఇండియా ఎండీ  మనుకుమార్‌ జైన్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ 29నుంచి అమెజాన్‌తో పాటు ఎంఐ స్టోర్లలో లభ్యం.  

జియో ఆఫర్‌ : రెడ్‌మి 7 కొనుగోలు చేసిన వినియోగదారులకు నాలుగేళ్లపాటు  డబుల్‌ డేటా,  2400 రూపాయల క్యాష్‌బ్యాక్‌ జియో ద్వారా లభ్యం కానుంది.

2జీబీ ర్యామ్‌, 32 స్టోరేజ్‌  ధర  రూ.7,999
3జీబీ ర్యామ్‌, 32 స్టోరేజ్‌  ధర  రూ. 8.999


రెడ్‌మి 7 ఫీచర్లు
6. 26 డిస్‌ప్లే డాట్‌ నాచ్‌ డిస్‌ప్లే
12+2 ఎంపీ ఏఐ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీకెమెరా 
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

స్మార్ట్‌ ఎల్‌ఈడీ బల్బ్‌
అలాగే ఎల్‌ఈడీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన  షావోమి ఒక ఎల్‌ఈడీ స్మార్ట్‌బల్బ్‌ను కూడా  ఈ ఈవెంట్‌లో లాంచ్‌ చేసింది.  ఏకంగా 16 మిలియన్ల రంగుల్లో ఎల్‌ఈడీ స్మార్ట్‌ బల్బ్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. 11 ఏళ్ల లాంగ్‌ లైఫ్‌ అందించే ఈ స్మార్ట్‌బల్బ్‌ను  ఎంఐ హోం యాప్‌, ఎలెక్సా , గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా దీన్ని ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఇది ఎంఐడాట్‌ కామ్‌ ద్వారా మాత్రమే లభ్యం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top