
న్యూఢిల్లీ: మెడికల్ టెక్నాలజీ స్టార్టప్ ఆక్సియో బయోసొల్యూషన్స్‌లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. సిరీస్ బి నిధుల సమీకరణలో భాగంగా రతన్ టాటాకు చెందిన ఆర్‌ఎన్‌టీ క్యాపిటల్‌తో పాటు యాక్సెల్ పార్ట్‌నర్స్, ఐడీజీ వెంచర్స్ ఇండియా నుంచి 74 లక్షల డాలర్ల పెట్టుబడులను సమీకరించినట్లు సదరు స్టార్టప్ తెలిపింది. కొత్త మార్కెట్లలో విస్తరణ కోసం ఈ నిధులు వినియోగిస్తామని పేర్కొంది. ఆక్సియో బయో బోస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.