పన్నుల విధానాలే స్టార్టప్‌లకు అడ్డం

Raman Rai comments on startup's - Sakshi

నాస్కామ్‌ చైర్మన్‌ రమణ్‌ రాయ్‌ వ్యాఖ్యలు  

బెంగళూరు: సంక్లిష్టమైన పన్నుల విధానాలే స్టార్టప్‌ సంస్థల వృద్ధికి నిరోధకాలుగా ఉంటున్నాయని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ చైర్మన్‌ రమణ్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ఏంజెల్‌ ఇన్వెస్టర్లకు ఈ నిబంధనలు సమస్యాత్మకంగా ఉంటున్నాయని చెప్పారు. నాస్కామ్‌ ఉత్పత్తుల సదస్సు 2017లో ‘భారతీయ స్టార్టప్‌ వ్యవస్థ’పై నాస్కామ్‌–జిన్నోవ్‌ నివేదికను విడుదల చేసిన సందర్భంగా రాయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

నాస్కామ్‌ అంచనా ప్రకారం ఏటా 30–35 శాతం స్టార్టప్‌ సంస్థలు మూతబడుతున్నాయి. పలు స్టార్టప్‌లలో ఏంజెల్‌ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులను పన్నుల శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడటం లేదని, వీటిని ఆదాయం కింద పరిగణిస్తుండటంతో ఆయా స్టార్టప్‌ సంస్థలు అసలు పని వదిలేసి పన్నుల శాఖల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రారంభ దశ, తదుపరి దశ ఫడింగ్‌ మెరుగ్గానే ఉంటున్నా.. ఏంజెల్‌ స్థాయి పెట్టుబడులు 53 శాతం మేర తగ్గిపోయాయని చెప్పారాయన.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top