ఫస్ట్‌సోర్స్‌లో రాకేష్‌ పెట్టుబడి- షేరు జూమ్ | Rakesh jhunjhunwala invests in Firstsource solutions | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌సోర్స్‌లో రాకేష్‌ పెట్టుబడి- షేరు జూమ్

Jul 10 2020 11:01 AM | Updated on Jul 10 2020 11:04 AM

Rakesh jhunjhunwala invests in Firstsource solutions - Sakshi

సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్‌ జున్‌జున్‌వాలా తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. బీఎస్ఈ గణాంకాల ప్రకారం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 57 లక్షల షేర్లను అదనంగా కొనుగోలు చేశారు. ఇది కంపెనీ ఈక్విటీలో 0.86 శాతం వాటాకు సమానంకాగా.. దీంతో ఫస్ట్‌సోర్స్‌లో రాకేష్ వాటా 2.88 శాతానికి బలపడింది. వెరసి బీపీవో సేవల కంపెనీ ఫస్ట్‌సోర్స్‌లో ప్రస్తుతం రాకేష్‌ జున్‌జున్‌వాలా 2 కోట్ల షేర్లను కలిగి ఉన్నట్లయ్యింది. మార్చి చివరికల్లా కంపెనీలో రాకేష్ వాటా 2.06 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.

ఫండ్స్‌ సైతం
గత మూడు నెలల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌లో 7.46 శాతం నుంచి 7.78 శాతానికి పెరిగింది. అయితే ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 9 శాతం నుంచి 7.64 శాతానికి తగ్గింది. ఈ వార్తల నేపథ్యంలో ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.4 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. షేరు 2019 సెప్టెంబర్‌ 16న రూ. 55.3 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా.. ఈ ఏడాది మార్చి 24న రూ. 20 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement