అమగి మీడియా ల్యాబ్స్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి | Premji invests in Amagi Media Labs | Sakshi
Sakshi News home page

అమగి మీడియా ల్యాబ్స్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి

Jan 21 2015 2:57 AM | Updated on Sep 2 2017 7:59 PM

అమగి మీడియా ల్యాబ్స్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి

అమగి మీడియా ల్యాబ్స్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి

అడ్వర్టయిజ్‌మెంట్ నెట్‌వర్క్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమగి మీడియా ల్యాబ్స్‌లో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ పెట్టుబడి పెట్టారు.

బెంగళూరు: అడ్వర్టయిజ్‌మెంట్ నెట్‌వర్క్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమగి మీడియా ల్యాబ్స్‌లో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ పెట్టుబడి పెట్టారు. ఆయన సొంత ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా ఈ నిధులను వెచ్చించినట్లు అమగి మీడియా ల్యాబ్స్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తమ సంస్థలో సంస్థాగత ఇన్వెస్టర్‌గా ఉన్న మేఫీల్డ్ ఫండ్ కూడా తాజాగా మరోవిడత ఇన్వెస్ట్‌చేసినట్లు తెలిపింది.

అయితే, పెట్టుబడుల వివరాలు తెలియలేదు. మరిన్ని కొత్త చానళ్లను జత చేసుకోవడంతోపాటు జియో-టార్గెటింగ్ నెట్‌వర్క్ విస్తరణ, బ్రిటన్, సింగపూర్, అమెరికాల్లో కార్యాలయాల ఏర్పాటుకు తాజా పెట్టుబడులను వినియోగిస్తామని అమగి సహ-వ్యవస్థాపకుడు భాస్కర్ సుబ్రమణియన్ తెలిపారు. 2008-09లో అమగి... నాదత్తూర్ ఇన్వెస్ట్‌మెంట్స్, మేఫీల్డ్‌ల నుంచి 1.2 కోట్ల డాలర్లను సమీకరించింది. నిర్ధిష్ట ప్రాంతాలు, మార్కెట్లలో వివిధ కార్పొరేట్ బ్రాండ్‌ల యాడ్‌లు వచ్చే విధంగా అమగి నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ సేవలందిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement