ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్‌ను వెంటనే నిలిపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వారం రోజులపాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి మ్యాచ్‌లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ 2025ను నిలిపివేయడం ప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లలో ఆందోళనలకు కారణమవుతుంది. ప్రకటనల ఆదాయంలో 35% తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. లీగ్ వాయిదా పడడం వల్ల మార్కెటింగ్ ప్రణాళికలకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు.బ్రాడ్కాస్టర్లు, బ్రాండింగ్ కంపెనీల ఆందోళనభారతదేశంలో అత్యంత లాభదాయకమైన క్రీడా ఈవెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఇది మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. భారీ ప్రకటనల ఆదాయాన్ని సృష్టిస్తోంది. మార్కెటింగ్ కీలకంగా మారిన ఈ లీగ్ పునఃప్రారంభించకపోతే జియోహాట్‌స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు రూ.2,000 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. చాలా బ్రాండ్లు ఐపీఎల్ వాణిజ్య ప్రకటనల కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయించాయి. అధిక వ్యూయర్షిప్ ద్వారా రాబడిని పెంచాలని నిర్ణయించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొత్త వ్యూహాలతో ముందుకుసాగాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.జట్లు, ఫ్రాంచైజీలపై ప్రభావంప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లకు మించి ఈ వాయిదా నిర్ణయం నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై ఆధారపడే జట్లు తమ సంపాదనలో 20% క్షీణతను చూడవచ్చని కొందరు అంటున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో అనిశ్చితి కారణంగా అనేక ఫ్రాంచైజీలు స్పాన్సర్షిప్లను, టిక్కెట్ల అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇండియా-యూఎస్ వయా యూరప్భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లీగ్ నిలిపివేతకు జాతీయ ప్రయోజనాలే కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేర్కొంది. తొలుత వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, అప్పటివరకు యుద్ధం సమసిపోనట్లయితే ఇది మరింతకాలం పోడిగించే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం అయితే లీగ్‌ను రద్దు చేసుకోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.