మళ్లీ పైకి చూస్తున్న పెట్రో ధరలు

Petrol, diesel prices hiked again on Friday - Sakshi

సాక్షి, ముంబై : దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల  ప్రభావంతో  జనవరి నుంచి  మొదలుపెట్టి వరుసగా శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 19 పెరిగింది. దీంతో  ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.55కి.. డీజిల్ ధర రూ.64.97కి పెరిగింది.

ముంబై : పెట్రోలు ధర రూ.76.18, డీజిల్ రూ.68.02
చెన్నై: పెట్రోల్‌ రూ.73.23  డీజిల్‌ రూ.68.62
కోలకతా: పెట్రోల్‌ రూ.72.65,  డీజిల్‌ రూ.66.74
హైద‌రాబాద్‌: పెట్రోల్ ధర రూ.74.84, డీజిల్ ధరరూ.70.63  
విజయవాడ : పెట్రోల్‌ రూ.74.64 డీజిల్‌ రూ.70.05 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.87 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర 9సార్లు, డీజిల్ ధర 10సార్లు పెరిగింది. దీంతో పైసా పైసా పెరుగతూ వస్తున్న ధరలు మళ్లీ పాత స్థితికి  చేరుకుంటూ వుండటంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top