పెప్సికో ‘7అప్ రివైవ్’.. | Pepsico launches new hydration drink Revive | Sakshi
Sakshi News home page

పెప్సికో ‘7అప్ రివైవ్’..

Mar 12 2016 12:48 AM | Updated on Sep 3 2017 7:30 PM

పెప్సికో ‘7అప్ రివైవ్’..

పెప్సికో ‘7అప్ రివైవ్’..

ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంలో ఉన్న పెప్సికో తాజాగా 7అప్ రివైవ్ పేరుతో హైడ్రోటానిక్ డ్రింక్‌ను హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ప్రవేశపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంలో ఉన్న పెప్సికో తాజాగా 7అప్ రివైవ్ పేరుతో హైడ్రోటానిక్ డ్రింక్‌ను హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ప్రవేశపెట్టింది. పానీయంలో బి3, బి6, బి12 విటమిన్లతోపాటు సోడియం, పొటాషియం ఉంటాయి. శారీరక శ్రమ కారణంగా కోల్పోయిన లవణాలను రివైవ్ భర్తీ చేస్తుందని పెప్సికో ఇండియా బెవరేజ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తమిళనాడు, కేరళ విపణిలో ప్రయోగాత్మకంగా గతేడాది విడుదల చేశామన్నారు. ఉత్పాదన విజయవంతం కావడంతో దేశంలో 10 ప్రధాన మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ధర మార్కెట్‌నుబట్టి 200 ఎంఎల్ రూ.12-14, 500 ఎంఎల్ పెట్ బాటిల్ రూ.30-35 ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement