హీరో మోటో భారీ విస్తరణ ప్రణాళికలు

Pawan Munjal Focus on Hero Motocorp Expansion - Sakshi

వచ్చే 5–7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్‌.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ఇందు కోసం వచ్చే 5–7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజాల్‌ ప్రకటించారు. ఈ ఏడాదిలో 10 కోట్ల వాహన విక్రయాల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు.

బీఎస్‌–6 గ్లామర్‌ విడుదల: భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్ఘార నిబంధనలకు అనుగుణంగా ఉన్న హీరో గ్లామర్‌ బైక్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ. 68,900– 72,000 కాగా, ప్యాషన్‌ ప్రో ధరల శ్రేణి రూ. 64,990– 67,190గా నిర్ణయించింది. ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top