వారికి పాస్‌పోర్టు ఫీజు మినహాయింపు | Passports to be in both English and Hindi | Sakshi
Sakshi News home page

వారికి పాస్‌పోర్టు ఫీజు మినహాయింపు

Jun 23 2017 2:58 PM | Updated on Sep 5 2017 2:18 PM

వారికి  పాస్‌పోర్టు ఫీజు మినహాయింపు

వారికి పాస్‌పోర్టు ఫీజు మినహాయింపు

పాస్‌పోర్టు చట్ట ఉత్సవాల సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ సీనియర్‌ సిటిజనులకు, చిన్నపిల్లలకు పాస్‌పోర్టు పీజులో మినహాయింపును ప్రకటించారు.

న్యూఢిల్లీ: పాస్‌పోర్టు చట్టం  ఉత్సవాల సందర్భంగా విదేశీ వ్యవహారాల  శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ సీనియర్‌ సిటిజనులకు, చిన్నపిల్లలకు  పాస్‌పోర్టు పీజులో మినహాయింపును ప్రకటించారు. అలాగే పాస్‌పోర్టులు ఇకపై రెండు భాషల్లో జారీకానున్నాయని చెప్పారు.  కేవలం ఇంగ్లీషులోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లో   ఉండనున్నాయని సుష్మా  స్వరాజ్‌  శుక్రవారం   ప్రకటించారు.

1967 పాస్సోర్ట్‌  చట్టం 50 సంవత్సరాల సందర్భంగా  నిర్వహించిన  పాస్‌పోర్ట్‌  సేవా దివస్‌ సందర్భంగా  అధికారుల సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు.  రెండురోజుల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో  పాస్‌పోర్ట్‌ రుసుములో తగ్గింపును ప్రకటించారు. ముఖ్యంగా ఎనిమిది సం.రాల లోపు వారికి, 60 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు  ఫీజులో 10 శాతం తగ్గింపుని ప్రకటించారు.
 

కాగా పాస్‌పోర్ట్లో  ప్రకటించే  వ్యక్తిగత వివరాలు  ప్రస్తుతం  ఆంగ్లంలో  మాత్రమే ముద్రిస్తున్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement