మార్కెట్లోకి ఒప్పొ‘రెనో 2’ సిరీస్‌

Oppo Reno2 Series Launch in India - Sakshi

ధరల శ్రేణి రూ.29,990–36,990

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా భారత మార్కెట్లోకి ‘రెనో 2’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది. ‘రెనో 2, రెనో 2 జెడ్, రెనో 2 ఎఫ్‌’ పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను తాజా సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 2 ధర రూ.36,990 కాగా, సెప్టెంబర్‌ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రెనో 2 జెడ్‌ ధర రూ.29,990 ఉండగా, ఈ ఫోన్‌ ప్రీ–బుకింగ్స్‌ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబరు 6న వినియోగదారులకు ఇది లభ్యంకానుంది. రెనో 2 ఎఫ్‌ నవంబరులో అందుబాటులోకిరానుంది. తాజా సిరీస్‌తో కంపెనీ మార్కెట్‌ వాటా ఈఏడాదిలో 10 శాతానికి చేరుకోవాలనేది తమ లక్ష్యమని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సుమిత్‌ వాలియా అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top