5జీ ఫోన్‌ రేసులో ఒప్పో | OPPO to launch Qualcomm powered dual-mode 5G phone soon    | Sakshi
Sakshi News home page

5జీ ఫోన్‌ రేసులో ఒప్పో

Oct 29 2019 2:14 PM | Updated on Oct 29 2019 2:15 PM

OPPO to launch Qualcomm powered dual-mode 5G phone soon    - Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ చైనా మొబైల్‌ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్‌కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను  విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది.  బార్సిలోనాలో జరగనున్న  క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో  ఒప్పో 5జీ  సైంటిస్ట్ హెన్రీ టాంగ్  షేర్‌ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్  షేర్‌ చేసినవివరాల ప్రకారం  ఒప్పో కొత్త 5 జీ మొబైల్ డ్యూయల్-మోడ్‌తోవస్తుంది. స్టాండ్‌లోన్‌ (ఎస్‌ఐ),  నాన్-స్టాండలోన్ (ఎన్‌ఎస్‌ఎ) నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. 5 జీపై ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఉత్పత్తులు, యాప్స్‌, భవిష్యత్తరానికి అందనున్న కట్టింగ్ ఎడ్జ్ అనుభవాలపై తన  అంచనాలను పంచుకున్నారు. తమ తరువాతి తరం డ్యూయల్-మోడ్ 5జీ  డివైస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మార్కెట్లలో ఎక్కువమంది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.  సెప్టెంబర్ 2019 నాటికి, 2,500 గ్లోబల్ పేటెంట్‌ ఫ్యామిటీకి దరఖాస్తు చేయగా 1,000 కి పైగా యూరోపియన్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ కు ప్రకటించినట్టుఆయన  ఒక ప్రకటనలో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement