20ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్‌5 | Oppo F5 With 20-Megapixel Selfie Camera Launched | Sakshi
Sakshi News home page

20ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్‌5

Oct 27 2017 11:34 AM | Updated on Oct 27 2017 11:34 AM

Oppo F5 With 20-Megapixel Selfie Camera Launched

చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి ఒప్పో గురువారం తన సరికొత్త సెల్ఫీ-ఫోకస్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్‌5 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ముందు హ్యాండ్‌సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కూడా సెల్ఫీలను ఫోకస్‌ చేసుకుని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 2న లాంచ్‌ కానుంది. రెండు స్టోరేజ్‌ ఆప్షన్లను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ దీని ధర సుమారు రూ.20వేలు. అదేవిధంగా ఎరుపు రంగులో 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకొచ్చింది. కానీ దీని ధరను వెల్లడించలేదు. 

ఒ‍ప్పో ఎఫ్‌5 స్పెషిఫికేషన్లు...
ఏఐ-ఎనాబుల్డ్‌ బ్యూటీ టెక్నాలజీ
20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
16 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే విత్‌ ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్‌
ఆక్టా-కోర్‌ మీడియాటెక్‌ ప్రాసెసర్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌
3200 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement