ఆన్లైన్లో ఆభరణాలు ధగధగ.. | Online Jewelry picks up steam from booming E-commerce | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో ఆభరణాలు ధగధగ..

Jul 9 2016 1:32 AM | Updated on Sep 4 2017 4:25 AM

ఈ కామర్స్ బూమ్ కారణంగా ఆన్‌లైన్‌లో ఆభరణాల కొనుగోళ్లు మెరిసిపోతున్నాయి. రానున్న మూడేళ్లలో భారత్ ఆన్‌లైన్ ఆభరణాల మార్కెట్

3 ఏళ్లలో 24వేల కోట్లకు మార్కెట్!
ముంబై: ఈ కామర్స్ బూమ్ కారణంగా ఆన్‌లైన్‌లో ఆభరణాల కొనుగోళ్లు మెరిసిపోతున్నాయి. రానున్న మూడేళ్లలో భారత్ ఆన్‌లైన్ ఆభరణాల మార్కెట్ 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.24,120కోట్లు)కు చేరుకోనున్నట్టు జ్యుయల్ మార్ట్ సంస్థ సీఈవో ఆదిష్ షా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఆభరణాల మార్కెట్ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లుగా ఉండగా... అది వచ్చే మూడేళ్ల కాలంలో 18 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అప్పటికి భారత ఆన్‌లైన్ ఆభరణాల మార్కెట్ ప్రపంచ మార్కెట్ విలువలో 20% వాటాను దక్కించుకుంటుందన్నారు.

 మూడేళ్లలో రూ.300 కోట్ల ఆదాయం
తాము తొలిసారిగా వినియోగదారులకు, వ్యాపారుల కోసం జ్యుయల్‌మార్ట్.కామ్‌ను ప్రారంభించామని, తొలి ఏడాదిలో (2016-17) రూ.100 కోట్ల టర్నోవర్‌పై దృష్టిసారించామని ఆదిష్ షా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement