ఫైర్42ను కొనుగోలు చేసిన హలోకర్రీ | Online Food Delivery Startup halokarri | Sakshi
Sakshi News home page

ఫైర్42ను కొనుగోలు చేసిన హలోకర్రీ

Jun 23 2015 3:14 AM | Updated on Sep 5 2018 9:45 PM

ఫైర్42ను కొనుగోలు చేసిన హలోకర్రీ - Sakshi

ఫైర్42ను కొనుగోలు చేసిన హలోకర్రీ

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ హలోకర్రీ మరో కంపెనీని కొనుగోలు చేసింది.

రెండు నెలల్లో ఢిల్లీలోని మరో కంపెనీ టేకోవర్
  ఆ తర్వాతే నిధుల సమీకరణపై దృష్టి
  హలోకర్రీ కో-ఫౌండర్ రాజు భూపతి

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ హలోకర్రీ మరో కంపెనీని కొనుగోలు చేసింది. రెండు నెలలక్రితమే పరాటాపోస్ట్‌ను టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నగరం వేదికగా పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీ ఫైర్42ను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువ ఎంతనేది చెప్పలేదు. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హలోకర్రీ కో-ఫౌండర్ రాజు భూపతి మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
 
  హోమ్ డెలివరీ రంగంలో టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్ విషయంలో కస్టమర్లకు ఏ చిన్న అవాంతరం ఎదురైనా వారు నిరాసక్తి చెందుతారు.  దాని ప్రభావం కంపెనీ ఎదుగుదలపై పడుతుంది. అయితే ఈ విషయంలో పోటీ కంపెనీలతో ముందుండాలనే క్లౌడ్, మొబైల్ ఆధారితమైన టెక్నాలజీ కంపెనీ ఫైర్42ను కొనుగోలు చేశాం. ఇకపై ఈ కంపెనీ తన సేవలను ఇతర కంపెనీలకు విక్రయించడానికి లేదు.
 
  ప్రస్తుతం హలోకర్రీకి హైదరాబాద్‌లో 6, బెంగళూరులో 3 డెలివరీ పాయింట్లున్నాయి. త్వరలోనే వీటిని విస్తరించనున్నాం. ప్రస్తుతం రోజుకు 800-1,000 ఆర్డర్లొస్తున్నాయి. ఈ ఏడాది రూ.10-12 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తాం. గతేడాదితో పోల్చితే ఇది 8-10 శాతం వృద్ధి రేటు.
 
 రెండు నెలల్లో ఢిల్లీలోని ఓ హోమ్ డెలివరీ కంపెనీని కొనుగోలు చేసి అక్కడ హలోకర్రీ సేవలను ప్రారంభించనున్నాం. ఆ తర్వాత ముంబైకి విస్తరిస్తాం. ఇప్పటికే చాలా కంపెనీలు ఫండింగ్ చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. కానీ, మూడు నెలల తర్వాతే నిధుల సమీకరణపై దృష్టిపెడతాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement