ఈ స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీక్‌: లాంచింగ్‌కు ముందే

OnePlus 5T Details of design, features & specs revealed - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ  చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ ప్లస్‌ అతి త్వరలో లాంచ్‌ చేయనున్న ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వివరాలు ఆన్‌లైన్‌లో  లీకయ్యాయి. నవంబరు 16న న్యూయార్క్‌లో అధికారికరంగా మార్కెట్లో విడుదల కానున్న వన్‌ప్లస్‌ 5టి  స్మార్ట్‌ఫోన్‌కు  సంబంధించిన  స్పెసికేషన్స్‌,  డిజైన్‌ తదితర వివరాలు బయటికి వచ్చాయి.  ఫుల్‌హెచ్‌డీ  రిజల్యూషన్ భారీ స్క్రీన్‌, డ్యుయల్‌ కెమెరా సెటప్‌,  ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ , ఫేస్‌ అన్‌లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో ​  ఫీచర్‌తో దీన్ని లాంచ్‌ చేయనుందని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది.   దాదాపు వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే ఉన్నప్పటికీ  తాజా  డివైజ్‌ను 6జీబీ/64జీబీ స్టోరేజ్‌ , 8 జీబీ/128 స్టోరేజ్‌  వేరియంట్లలో దీన్ని లాంచ్‌ చేయనుందట. 
 

ఇండియాలో వన్‌ప్లస్‌ 5టి  లభ్యత
ఇప్పటి వరకు అందిన సమాచారం వన్‌ప్లస్‌ 5టి  నవంబర్‌ 21న ఇండియన్‌  మార్కెట్లో లాంచ్‌ కానుంది. నవంబర్‌ 28నుంచి అమెజాన్‌ ఇండియా ద్వారా విక్రయానికి లభించనుంది.  మరోవైపు  వైర్‌లెస్‌ చార్జర్‌తో  ఈ డివైస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వన్‌ ప్లస​ సీఈవో ఇప్పటికే వెల్లడించారు.  

వన్‌ప్లస్‌ 5టి  ఫీచర్లు
6అంగుళాల ఆప్లిక్‌ అమోలెడ్‌  డిస్‌ప్లే 
1080 x 2160 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1
6జీబీ ర్యామ్‌ 
64 జీబీ స్టోరేజ్‌
3,300 ఎంఏహెచ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top