ఒకేసారి 2 దుకాణాలు బంద్ | Ola winds up TaxiForSure | Sakshi
Sakshi News home page

ఒకేసారి 2 దుకాణాలు బంద్

Aug 18 2016 12:45 AM | Updated on Sep 4 2017 9:41 AM

ఒకేసారి 2 దుకాణాలు బంద్

ఒకేసారి 2 దుకాణాలు బంద్

ఒకే రోజు రెండు పరిణామాలు. ఒకటి ట్యాక్సీ సేవలందించే ట్యాక్సీఫర్ ష్యూర్, మరొకటి ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ పోర్టల్ ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్ కామ్.

ట్యాక్సీ ఫర్ ష్యూర్‌ను నిలిపేస్తున్న ఓలా
కనుమరుగవుతున్న ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్ కామ్
దాన్ని తనలో కలిపేసుకుంటున్న స్నాప్‌డీల్

ఒకే రోజు రెండు పరిణామాలు. ఒకటి ట్యాక్సీ సేవలందించే ట్యాక్సీఫర్ ష్యూర్, మరొకటి ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ పోర్టల్ ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్ కామ్. ఈ రెండూ కూడా ప్రముఖ సంస్థలకు చెందిన ప్రత్యేక విభాగాలు. ట్యాక్సీఫర్ ష్యూర్ ఓలాకు చెందినది కాగా, ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్‌కామ్ సంస్థ స్నాప్‌డీల్‌కు చెందినది. మరో చిత్రమేంటంటే... ఈ రెండింటినీ ఓలా, స్నాప్‌డీల్ సరిగ్గా 18 నెలల క్రితమే కొనుగోలు చేశాయి. యాధృచ్చికంగా... వాటిని ఒకేసారి మూసేస్తున్నాయి.

 ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ సేవలకు ఓలా గుడ్‌బై
న్యూఢిల్లీ: ట్యాక్సీ ఫర్ ష్యూర్ పేరుతో అందిస్తున్న సేవలను నిలిపివేయాలని ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఓలా’ నిర్ణయించింది. ఫలితంగా కాల్ సెంటర్, వ్యాపార అభివృద్ధి విభాగంలో పనిచేసే 700 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ట్యాక్సీ ఫర్ ష్యూర్ సేవలు నిలిపివేస్తుండడంతో దీని కింద పనిచేస్తున్న డ్రైవర్-భాగస్వాములు, కస్టమర్లను ఓలా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించినట్టు కంపెనీ తెలిపింది. తన ప్రత్యర్థిగా ఉన్న ట్యాక్సీ ఫర్ ష్యూర్‌ను 18 నెలల క్రితం 20 కోట్ల డాలర్లు వెచ్చించి ఓలా సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఎకానమీ సేవలను ఈ బ్రాండ్ కింద కొనసాగిస్తూనే ఉంది. అదే సమయంలో ఓలా మైక్రో పేరుతో ఏసీ క్యాబ్ సేవలను ప్రారంభించి తక్కువ బడ్జెట్ సేవలు కోరుకునే వారిని అటువైపు ఆకర్షించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 పట్టణాల్లో ఓలా మైక్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ట్యాక్సీ ఫర్ ష్యూర్ సేవలు నిలిపివేయడం వల్ల కోల్పోయే ఉద్యోగాలపై ఓలా స్పందించలేదు. సాధ్యమైనంత మందిని ఓలా ప్లాట్‌ఫామ్ కింద సర్దుబాటు చేసినట్టు తెలిపింది. అయితే, వ్యయం తగ్గించుకునే చర్యల్లో ఇదొక భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 ఎక్స్‌క్లూజివ్‌లీ.కామ్‌ను మూసేస్తున్న స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ 18 నెలల క్రితం కొనుగోలు చేసిన బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ ఉత్పత్తుల విక్రయ పోర్టల్ ఉ్ఠఛిఠటజీఠ్ఛిడ.ఛిౌఝను మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్ కామ్‌లో విక్రయించే అన్ని రకాల ఉత్పత్తులను స్నాప్‌డీల్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇకపై వీటిని స్నాప్‌డీల్ పోర్టల్ వేదికగా కొనుగోలు చేసుకోవచ్చని స్నాప్ డీల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌లీ పోర్టల్‌కు చెందిన ఉద్యోగులందరినీ స్నాప్‌డీల్‌లో సర్దుబాటు చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లో ఎక్స్‌క్లూజివ్‌లీ సైట్ నిలిచిపోనుందని తెలిపారు. ఈ సైట్‌ను స్నాప్‌డీల్ 18 నెలల క్రితం బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. డిజైనర్ బ్రాండ్లు డీకేఎన్‌వై, అర్మాని, మైకేల్‌కోర్స్, పోర్షే డిజైన్, మార్క్ జాకబ్స్, వెరో మొడా, ఎఫ్‌సీయూకే, బిబా, ఏఎండీ, యూసీబీ, ప్యూమా వంటి బ్రాండెడ్ ఉత్పత్తులను ఈ సైట్ ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఫ్యాషన్ విభాగంలో స్నాప్‌డీల్‌లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచే దిశగా తీసుకున్న చర్యగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కువ లాభాల మార్జిన్లుండే ఈ విభాగంలో అధిక వాటా కోసం స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ తీవ్రంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement