రిలయన్స్ తొలి మహిళాడైరక్టర్గా నీతా అంబానీ | Nita Ambani becomes first woman director on Reliance board | Sakshi
Sakshi News home page

రిలయన్స్ తొలి మహిళాడైరక్టర్గా నీతా అంబానీ

Jun 18 2014 4:26 PM | Updated on Oct 5 2018 8:54 PM

రిలయన్స్ తొలి మహిళాడైరక్టర్గా నీతా అంబానీ - Sakshi

రిలయన్స్ తొలి మహిళాడైరక్టర్గా నీతా అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆ కంపెనీ డైరక్టర్గా నియమితులయ్యారు.

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆ కంపెనీ డైరక్టర్గా నియమితులయ్యారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన రిలయన్స్లో డైరక్టర్ అయిన తొలి మహిళ నీతా అంబానీ కావడం విశేషం.

బుధవారం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ షేర్ హోల్డర్లు నీతా నియామకానికి ఆమోద ముద్ర వేశారు. 50 ఏళ్ల నీతా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యజమానిగా సుపరిచితురాలు.
 

Advertisement
 
Advertisement
Advertisement