నిస్సాన్ కొత్త సన్నీ | Nissan launches New Sunny in India | Sakshi
Sakshi News home page

నిస్సాన్ కొత్త సన్నీ

Jul 4 2014 12:45 AM | Updated on Sep 2 2017 9:46 AM

నిస్సాన్ కొత్త సన్నీ

నిస్సాన్ కొత్త సన్నీ

నిస్సాన్ ఇండియా కంపెనీ సన్నీ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.

  పెట్రోల్ కార్ల ధరలు  రూ.7.29-రూ.9.29 లక్షలు
  డీజిల్ కార్ల ధరలు రూ. 8.33- 10.02 లక్షలు

ముంబై: నిస్సాన్ ఇండియా కంపెనీ సన్నీ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ సన్నీ కారును మూడు పెట్రోల్, ఐదు డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అండీ పామర్ చెప్పారు. పెట్రోల్ కార్ల ధరలు రూ.7.29 లక్షల నుంచి రూ.9.29 లక్షల రేంజ్‌లో, డీజిల్ కార్లు రూ.8.33 లక్షల నుంచి రూ.10.02 లక్షల రేంజ్‌లో ఉన్నాయని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై) వివరించారు.  పెట్రోల్ వేరియంట్లు 17 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్లు 22.7 కి.మీ మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది.

 ప్రత్యేకతలు...
 ఈ కొత్త సన్నీ కారులో బూమరాంగ్ షేప్ హెడ్‌ల్యాంప్స్, కొత్తగా ఫాగ్ ల్యాంప్స్, అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, 12-స్పోక్ వై-ప్యాటర్న్ అలాయ్ వీల్స్, రీ డిజైన్ చేసిన డాష్‌బోర్డ్, పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్,  బ్లూటూత్ ఎనేబుల్డ్ ప్రీమియం ఆడియో సిస్టమ్(వెనక ఉండే పార్కింగ్ కెమెరాకు ఇది డిస్‌ప్లేగా పనిచేస్తుంది), ఆడియో, టెలిఫోన్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త ప్రీమియం స్టీరింగ్ వీల్, వెనక కూర్చునే ప్రయాణికుల కోసం ఎయిర్ బ్లోయర్, రీడింగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. సన్నీ కారును నిస్సాన్ 2011లో మార్కెట్లోకి తెచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement