3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు | Nissan hikes prices across models by up to 3.5% | Sakshi
Sakshi News home page

3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు

Mar 7 2016 12:28 AM | Updated on Sep 3 2017 7:09 PM

3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు

3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు

కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి.

న్యూఢిల్లీ: కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన అన్ని రకాల మోడళ్లపై ధరలను 3.5% వరకూ పెంచింది. తాము విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్ల ధరలను 1% నుంచి 3.5 శాతం వరకూ పెంచుతున్నామని నిస్సాన్ కంపెనీ తెలిపింది. డాట్సన్ ధరలను 1% వరకూ, టెర్రానో, మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరలను 3.25% నుంచి 3.5% వరకూ పెంచుతున్నామని పేర్కొంది. ఈ కంపెనీ రూ. 3.23 లక్షల ధర ఉన్న డాట్సన్ గో నుంచి  నుంచి రూ.13.20 లక్షల ఖరీదున్న ఎస్‌యూవీ టెర్రానో వరకూ  వివిధ కార్లను విక్రయిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement