Nissan car prices
-
‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’
అమెరికా టారిఫ్‌లు వాహన ధరలను పెంచుతాయని నిస్సాన్ అమెరికా ఛైర్మన్ క్రిస్టియన్ మ్యూనియర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కారు కొనలేని పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలిపారు. మెక్సికో నుంచి ఎగుమతయ్యే వాహనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు ఆటోమొబైల్ కంపెనీలను కుదిపేస్తాయని చెప్పారు.‘20,000 డాలర్ల(రూ.16 లక్షలు) సగటు ధర కలిగిన నిస్సాన్ వెర్సా మెక్సికోలో తయారవుతుంది. టారిఫ్ అమల్లోకి రావడంతో అమెరికాకు దీని ఎగుమతులు కష్టంగా మారుతున్నాయి. యూఎస్‌లో చౌకగా లభించే కారు ఇకపై కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మెక్సికోకు బదులుగా అమెరికాలోనూ నిస్సాన్ చౌక వాహనాలను తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, మెక్సికో నుంచి కొన్ని విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే సవాళ్లు ఎదురవుతాయి’ అని మ్యూనియర్ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?కాక్స్ ఆటోమోటివ్ విశ్లేషణ ప్రకారం.. యూఎస్‌లో కారు సగటు ధర 48,000 డాలర్లు(సుమారు రూ.40 లక్షలు). ప్రభావిత మోడళ్ల ధరలకు టారిఫ్‌లు 10% నుండి 15% వరకు అదనంగా పెరుగుతాయి. లెవీ పరిధిలో లేని వాహనాల ధరలు మొత్తంగా 5% పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది. టారిఫ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన మోడళ్లలో 30,000 డాలర్ల(రూ.25 లక్షలు) కంటే తక్కువ ధర కలిగినవే ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉత్పత్తి అవుతున్నవే కావడం గమనార్హం. -
ఎలక్ట్రిక్ కార్లు కాదు..కానీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్..!
ఆటో మొబైల్ మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా..పెట్రో వెహికల్స్ డిమాండ్ తగ్గడం లేదు. వినియోగదారులకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు కొత్త మోడళ్లతో సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో పెట్రో వెహికల్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. తాజాగా జపాన్ ఆటో మొబైల్ దిగ్గజం నిన్సాన్‌కు చెందిన 'నిస్సాన్ మాగ్నైట్' వెహికల్స్ అమ్మకాలు మనదేశంలో జోరుగా కొనసాగుతున్నాయి. మైల్‌స్టోన్స్ జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ గతేడాది డిసెంబర్ నెలలో నిస్సాన్ మాగ్నైట్ సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ని మార్కెట్‌కి పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 30వేల కార్లకు పైగా డెలివరీ చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు తెలిపారు. నిస్సాన్ ఇండియా ఎస్యూవీ కోసం 72వేల బుకింగ్‌లు అయినట్లు చెప్పారు. అయితే భారీ స్థాయిలో కార్లను డెలివరీ చేయడం సాధారణ విషయం కాదని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతుండగా.. కోవిడ్, చిప్ కొరత ఉన్నా కార్లను డెలివరీ చేయడంపై మన దేశంలో నిస్సాన్ డీలర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిస్సాన్ మాగ్నైట్ ధర నిస్సాన్ మాగ్నైట్ భారతీయ మార్కెట్లో బ్రాండ్ మొట్టమొదటి సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ. సీఎంఎఫ్-ఏ ప్లస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఎస్యూవీ ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వీ నాలుగు వేరింట్లలో అందుబాటులో ఉండగా.. ఎస్యూవీ ధరలు రూ. 5.71 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో రూ. 9.89 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..! -
3.5 శాతం వరకూ పెరిగిన నిస్సాన్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: కార్లపై మౌలిక సెస్ విధింపు కారణంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన అన్ని రకాల మోడళ్లపై ధరలను 3.5% వరకూ పెంచింది. తాము విక్రయిస్తున్న అన్నిరకాల మోడళ్ల ధరలను 1% నుంచి 3.5 శాతం వరకూ పెంచుతున్నామని నిస్సాన్ కంపెనీ తెలిపింది. డాట్సన్ ధరలను 1% వరకూ, టెర్రానో, మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరలను 3.25% నుంచి 3.5% వరకూ పెంచుతున్నామని పేర్కొంది. ఈ కంపెనీ రూ. 3.23 లక్షల ధర ఉన్న డాట్సన్ గో నుంచి నుంచి రూ.13.20 లక్షల ఖరీదున్న ఎస్యూవీ టెర్రానో వరకూ వివిధ కార్లను విక్రయిస్తోంది.