ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న ఒత్తిడి నేడు కూడా మార్కెట్లను దెబ్బకొడుతోంది.
మార్కెట్లకు బ్యాంకుల దెబ్బ
Jun 28 2017 9:41 AM | Updated on Sep 5 2017 2:42 PM
ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న ఒత్తిడి నేడు కూడా మార్కెట్లను దెబ్బకొడుతోంది. బ్యాంకు షేర్లలో నెలకొన్న ఒత్తిడితో దేశీయ ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నేటి(బుధవారం) ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 19.27 పాయింట్లు పడిపోయి 31వేల కింద ట్రేడైంది. నిఫ్టీ సైతం 27.70 పాయింట్ల నష్టంలో 9,483.70గా నమోదైంది. జూన్ నెల డెరివేటివ్స్ సిరీస్ కూడా రేపటితో ముగియనుంది. అటు ఆసియన్ మార్కెట్లు నెగిటివ్ గా కొనసాగుతున్నాయి. హెల్త్ కేర్ లో ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జాప్యమవుతుండటంతో ఆసియన్ మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి.
ప్రారంభ ట్రేడింగ్ లో ఐటీసీ, ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎక్కువగా నష్టపోగా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ కు మద్దతుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.5 శాతం పడిపోయింది. విజయ్ బ్యాంకు, ఓబీసీ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఎస్కార్ట్స్, బజాజ్ ఫైనాన్స్, డీహెచ్ఎఫ్ఎల్, ఎల్ఐసీ హౌజింగ్ లు 1-2 శాతం నష్టాల్లో నడిచాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడి 64.55 వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 58 రూపాయల లాభంలో 28,568 వద్ద కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement