వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్ | next full demands on tablet pcs : ASUS | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్

Oct 1 2013 1:10 AM | Updated on Sep 1 2017 11:12 PM

వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్

వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్

ట్యాబ్లెట్ పీసీలతో నోట్‌బుక్ పీసీల అమ్మకాలు పడిపోలేదని ఏసూస్ ఇండి యా తెలిపింది. మార్కెట్ పుంజు కోవడానికి ట్యాబ్లెట్లు దోహదం చేస్తున్నాయ ని ఏసూస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్ సేల్స్ డెరైక్టర్ యునేజ్ ఖురేషి అన్నారు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీలతో నోట్‌బుక్ పీసీల అమ్మకాలు పడిపోలేదని ఏసూస్ ఇండి యా తెలిపింది. మార్కెట్ పుంజు కోవడానికి  ట్యాబ్లెట్లు దోహదం చేస్తున్నాయ ని ఏసూస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్ సేల్స్ డెరైక్టర్ యునేజ్ ఖురేషి అన్నారు. దేశవ్యాప్తంగా 50-60 లక్షల నోట్‌బుక్, నెట్‌బుక్ పీసీలు అమ్ముడవుతున్నాయి. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య 50 లక్షల దాకా ఉంది. వచ్చే ఏడాది ట్యాబ్లెట్ల మార్కెట్ అనూహ్యంగా ఉండబోతోందని చెప్పారు. నాలుగు రకాల ట్యాబ్లెట్ల విక్రయిస్తున్నామని, త్వరలో మరిన్ని మోడళ్లను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడి ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌లో ఏర్పాటు చేసిన ఏసూ స్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించి న అనంతరం మీడియాతో మాట్లాడారు.  
 
 ఒకేచోట 10 బ్రాండ్లు
 ఐటీ మాల్‌లో సోని, ఇంటెల్, ఏఎండీ, డెల్, తోషిబా, లెనోవో, ఏసూస్, ఏసర్, హెచ్‌పీ, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు ఏర్పాటయ్యాయి. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నెలకొల్పామని ఐటీ మాల్ డెరైక్టర్ మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement