రుణాలపై ఆర్‌కామ్‌ కొత్త ప్రణాళిక

A new plan on loans - Sakshi

ముంబై: భారీగా పేరుకుపోయిన రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ (ఆర్‌కామ్‌) మరో కొత్త ప్రణాళికను రూపొందించింది. మార్చి నాటికల్లా మొత్తం రుణ సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని కంపెనీ యోచిస్తోంది. బాకీలకు బదులుగా వాటాలిచ్చే ప్రసక్తి లేకుండా రుణ పునర్‌వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్‌) ప్రణాళిక నుంచి వైదొలగడం, వ్యూహాత్మక ఇన్వెస్టరుతో జట్టు కట్టడం మొదలైన అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ మంగళవారం ఈ విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

 సుమారు 1.8 బిలియన్‌ డాలర్ల బాకీని రాబట్టుకునేందుకు ఆర్‌కామ్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన చైనా సంస్థ కూడా తాజా ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనతో రుణభారం రూ. 25,000 కోట్ల మేర తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం ఆర్‌కామ్‌ రుణభారం రూ. 44,000 కోట్ల మేర ఉంది. కొత్త రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకటనతో ఆర్‌కామ్‌ షేర్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఏకంగా 32 శాతం మేర లాభపడ్డాయి. సంస్థ మార్కెట్‌ విలువ ఒకేరోజు రూ.1,389 కోట్లు పెరిగి రూ. 5,899 కోట్లకు చేరింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top