2020 నుంచి కొత్త కార్లన్నీ అవే!

2020 నుంచి కొత్త కార్లన్నీ అవే! - Sakshi

లండన్‌: కర్బన్‌ ఉద్గారాలకు చెక్‌పెట్టి, కాల్యుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు ఆటో కంపెనీలన్నీ వరుస బెట్టి స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా లగ్జరీ కారు తయారీదారి జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) తన ఎలక్ట్రిక్‌ వాహనాల ప్లాన్‌ను ప్రకటించింది. 2020 నుంచి తమ కొత్త వాహానాలన్నీ ఎలక్ట్రిక్‌ లేదా హైబ్రిడ్‌ వాహనాలేనని వెల్లడించింది. వోల్వో ప్రకటించిన రెండు నెలల తర్వాత జేఎల్‌ఆర్‌ తన ప్లాన్‌ను ప్రకటించింది. జేఎల్‌ఆర్‌ అభివృద్ధి చేసే కొత్త మోడల్స్‌ అన్నీ ఇక పూర్తిగా ఎలక్ట్రిక్‌ లేదా విద్యుత్‌, సంప్రదాయ ఇంజిన్లతో కూడిన హైబ్రిడ్‌ వాహనాలేనని గురువారం తెలిపింది. వచ్చే ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ జాగ్వార్‌ ఐ-పేస్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పింది. 

 

అయితే ప్రస్తుత మోడల్స్‌ అన్నీ పూర్తిగా పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో రూపొందుతున్నాయి. వీటిని ప్రస్తుతమైతే ఇలానే కొనసాగించనున్నట్టు జేఎల్‌ఆర్‌ సీఈవో రాల్ఫ్‌ స్పెత్‌ తెలిపారు. మరోవైపు ఎలక్ట్రిక్‌ మోడల్స్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2040 నుంచి కొత్త పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల విక్రయాలను నిషేధిస్తున్నట్టు బ్రిటన్‌ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎలక్ట్రిక్‌ మోడల్స్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. జేఎల్‌ఆర్‌ గతేడాది రూపొందించిన 1.7 మిలియన్ల కార్లలో 5,50,000 కార్లు బ్రిటన్‌ కోసమే అభివృద్ది చేసింది. తన స్వదేశీ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ మోడల్స్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు జేఎల్‌ఆర్‌ చెప్పింది. బ్రిటన్‌లో ఇది అతిపెద్ద కారు తయారీదారి.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top