డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా దరఖాస్తుకు ఎన్‌సీఎల్‌టీ ఓకే | NCLT admits RBI plea seeking bankruptcy resolution for DHFL | Sakshi
Sakshi News home page

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా దరఖాస్తుకు ఎన్‌సీఎల్‌టీ ఓకే

Dec 3 2019 5:51 AM | Updated on Dec 3 2019 5:51 AM

NCLT admits RBI plea seeking bankruptcy resolution for DHFL - Sakshi

ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌పై (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్‌బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్‌ ప్రవేశానికి అర్హమైనదని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద ఆర్‌బీఐ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు ధర బీఎస్‌ఈలో 5 శాతం క్షీణించింది. రూ.19.70 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ (ఒక రోజులో స్టాక్‌ ధర క్షీణించేందుకు గరిష్టంగా అనుమతించిన మేర) వద్దే క్లోజయింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ ఇంతే మొత్తం క్షీణించి రూ.19.75 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement