మోటో కొత్త ఫోన్‌ : టర్బో పవర్‌ మోడ్‌

Moto Z2 Force With Bundled TurboPower Pack Moto Mod Launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లిమిటెడ్‌ ఎడిషన్‌గా మోటో జెడ్2 ఫోర్స్‌ను  లాంచ్‌ చేసింది. భారత్‌లో దీని ధరను రూ.34,999గా నిర్ణయించింది.  ఈ కొత్త  స్మార్ట్‌ ఫోన్లు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటో హబ్ స్టోర్లలో గురువారం అర్ధరాత్రి  11.59 నిమిషాల నుంచి లభించనున్నాయి.   షట్టర్‌ ప్రూఫ్‌ స్క్రీన్‌,   సూపర్‌ స్లీక్‌ బాడీ, క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, టర్బో వపర్‌తో 6220 ఎంఏహెచ్‌ పవర్‌ దీని సొంతమని కంపెనీ చెబుతోంది. 

మోటో జెడ్2 ఫోర్స్‌ ఫీచర్స్‌
5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్
1440x2560  పిక్సెల్‌ రిజల్యూషన్‌
6జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం
12+12ఎంపీ  డ్యుయల్‌  రియర్‌ కెమెరా విత్‌  ఎల్‌ఈడీ ఫ్లాష్
5ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
2730 ఎంఏహెచ్ బ్యాటరీ ( టర్బో పవర్‌ ప్యాక్‌)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top