మోటో జీ5ఎస్ ప్లస్ ధర తగ్గింది | Moto G5S Plus Price in India Slashed   | Sakshi
Sakshi News home page

మోటో జీ5ఎస్ ప్లస్ ధర తగ్గింది

Dec 29 2017 2:37 PM | Updated on Jul 6 2019 3:18 PM

 Moto G5S Plus Price in India Slashed   - Sakshi

మోటో జీ5ఎస్ ప్లస్ ధర భారత్లో తగ్గింది. ఆగస్టులో రూ.15,999కు లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం వెయ్యి రూపాయల తక్కువగా రూ.14,999కే అందుబాటులోకి వచ్చింది. లెనోవో బ్రాండ్ మోటో తన జీ5ఎస్ ప్లస్ ధరను తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. జీ5ఎస్ ప్లస్ అమెజాన్.ఇన్, మోటో హబ్ స్టోర్ల వద్ద మాత్రమే ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉంది. బ్లస్ గోల్డ్, లునార్ గ్రే రంగుల్లో ఇది లభ్యమవుతోంది.13 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయర్ రియర్ కెమెరాను కలిగి ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. 

మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు...
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ఆక్టా-కోర్ ఎస్ఓసీ
4జీబీ ర్యామ్
13 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు వెనుక కెమెరాలు
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
64జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement