మరిన్ని కొత్త కొలువులు!: నౌకరీ.కామ్ సర్వే | More new jobs..in Naukri.com Survey | Sakshi
Sakshi News home page

మరిన్ని కొత్త కొలువులు!: నౌకరీ.కామ్ సర్వే

Aug 27 2015 12:53 AM | Updated on Sep 3 2017 8:10 AM

మరిన్ని కొత్త కొలువులు!: నౌకరీ.కామ్ సర్వే

మరిన్ని కొత్త కొలువులు!: నౌకరీ.కామ్ సర్వే

కొత్త కొలువుల సృష్టితో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశావహంగా ఉండనుంది...

న్యూఢిల్లీ: కొత్త కొలువుల సృష్టితో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశావహంగా ఉండనుంది. ఈ ఏడాది జాబ్ మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేస్తుందని నౌకరీ.కామ్ అభిప్రాయపడింది.  సర్వే ప్రకారం.. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో కొత్త ఉద్యోగాల సృష్టి ఉంటుందని దాదాపు 66 శాతం మంది రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 4-8 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగ నియామకాలు నమోదుకానున్నాయి. అవకాశాల వృద్ధితో కొన్ని రంగాల్లో ఉద్యోగులకు అధిక వేతనాలు లభించనున్నాయి. దాదాపు 68 శాతం మంది రిక్రూటర్లు ఉద్యోగ వేతనాలను 10 శాతం పైగా పెంచనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement