నోకియా లూమియా డ్యుయల్ సిమ్ | Sakshi
Sakshi News home page

నోకియా లూమియా డ్యుయల్ సిమ్

Published Sat, May 10 2014 1:59 AM

నోకియా లూమియా డ్యుయల్ సిమ్ - Sakshi

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కంపెనీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, లుమియా 630ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. మోటో జి, హెచ్‌టీసీ డిజైర్, శామ్‌సంగ్ గెలాక్సీ డ్యుయోస్‌లకు గట్టి పోటీనిచ్చేలా ఈ ఫోన్‌ను రంగంలోకి తేవాలని మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోం ది. ఈ లూమియా 630 మోడల్‌లో సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.9,500, డ్యుయల్ సిమ్ వేరియంట్ ధర రూ.10,100 ఉండవచ్చు. విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 4.5 అంగుళాల డిస్‌ప్లే, 5 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలుంటాయని సమాచారం. నోకియా హ్యాండ్‌సెట్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  భారత డ్యుయల్ సిమ్ మార్కెట్‌పై కన్నేసిన మైక్రోసాఫ్ట్  ఇప్పటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్, చైనా వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లలో డ్యుయల్ సిమ్ మార్కెట్ కీలకమని మైక్రోసాఫ్ట్ డివెసైస్ గ్రూప్ ఈవీపీ స్టీఫెన్ ఇలోప్ వ్యాఖ్యానించారు. 2016 కల్లా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డ్యుయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతాయన్న అంచనాలను వెల్లడించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement