
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం మరింత పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించింది. 116 పాయింట్ల లాభంతో32, 506 వద్ద,నిఫ్టీ 45పాయింట్ల లాభంతో 10, 191 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా టెలికాం, ఆటో, ఫార్మ రంగాలు లాభపడుతున్నాయి.
యూబీఎల్ (యునూటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) నుంచి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వైదొలగనున్నారనే వార్తలతో లాభపడుతోంది. ఐడియా, భారతి ఎయిర్‌టెల్,రిలయన్స్, మారుతి, ఐటీసీ లాభపడుతున్నాయి. అలాగే డా. రెడ్డీస్, సన్ ఫార్మ కూడా లభాల్లో ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో యాక్సిస్, ఐసీఐసీఐ, జీ, ఐడీఎఫ్‌సీ నష్టాల్లో ట్రేడ్‌అవుతున్నాయి.