
ఆగ్రా-జైపూర్ రోడ్డు ప్రాజెక్ట్ విక్రయించిన మధుకాన్
నిర్మాణ రంగ కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ ఒక రోడ్డు ప్రాజెక్టును సింగపూర్ కంపెనీకి విక్రయించింది...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కం పెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ ఒక రోడ్డు ప్రాజెక్టును సింగపూర్ కంపెనీకి విక్రయించింది. ఆగ్రా-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను రూ. 248 కోట్లకు సింగపూర్‌కు చెందిన క్యూబ్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ సింగపూర్‌కు విక్రయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని కి సంబంధించి ఈ నెల 21న ఒప్పందం కుదిరినట్లు మధుకాన్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 63 కి.మీ పొడవైన ఈ రహదారిని బీవోటీ విధానంలో అభివృద్ధి చేసి నిర్వహించుకోవడానికి 2006లో కాం ట్రాక్టు దక్కించుకుంది. 2009 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాజెక్టును 25 ఏళ్లపాటు టోలు ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఈ విక్రయ ఒప్పందానికితుది అనుమతులు లభించాల్సి ఉంది.