యాప్కి కహానీ.. | M. tracker financial transactions financial App specisl story | Sakshi
Sakshi News home page

యాప్కి కహానీ..

Jul 17 2016 11:49 PM | Updated on Oct 2 2018 5:51 PM

యాప్కి కహానీ.. - Sakshi

యాప్కి కహానీ..

సుందరం వయసు 26 ఏళ్లు. ఈ మధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరాడు. నెల జీతం వస్తుంది. కానీ ఆ వచ్చిన జీతం వారం రోజులు కూడా జేబులో నిలవడం లేదు.

ఎమ్‌ట్రాకర్..
సుందరం వయసు 26 ఏళ్లు. ఈ మధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరాడు. నెల జీతం వస్తుంది. కానీ ఆ వచ్చిన జీతం వారం రోజులు కూడా జేబులో నిలవడం లేదు. డబ్బులు అలా చేతిలోకి వచ్చి, ఇలా మాయమైనట్లు అవుతోంది. ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ తెచ్చుకోవడం ఎలా నో తెలియక సతమతమౌతున్నాడు. అలాంటి సమయంలో అతనికి స్నేహితుడి సలహామేరకు ‘ఎమ్‌ట్రాకర్-మనీ అండ్ ట్యాక్స్ మేనేజర్’ అనే ఫైనాన్షియల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడం ప్రారంభించాడు. దీంతో అతను తన ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ తెచ్చుకున్నాడు.

 ప్రత్యేకతలు..
మనీ మేనేజర్: ఇక్కడ మనం ఏ ఏ వాటిపై ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నామో ఆ వివరాలను యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లను ఇది ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసి ఆ సమాచారాన్ని ఆదాయవ్యయాలకు యాడ్ చేస్తుంది. ఇలా నెల వారి ఆదాయ వ్యయాలను ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూసుకోవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం వీలవుతుంది.

డాక్యుమెంట్ మేనేజర్: ఆర్థిక వ్యవహారాలకు సం బంధించిన పలు డాక్యుమెంట్లను, ఖర్చులకు చెందిన బిల్లులను అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్, ఆఫీస్ చలానా, బిల్లులు, పార్కింగ్ టికెట్స్, టోల్స్, ఐడీ డాక్యుమెంట్స్‌లను ఆయా కేటగిరిలకు జత చేసుకోవచ్చు.

మొబైల్, క్రెడిట్ కార్డులు, యుటిలిటీ బిల్స్ వంటి తదితర వాటికి సంబంధించిన అలర్ట్స్‌ను పెట్టుకోవచ్చు.

ఓటీపీ, క్రెడిట్ కార్డు నెంబర్స్, బ్యాంక్ అకౌం ట్స్ వంటి విలువైన సమాచారాన్ని యాక్సెస్ చేయబోమనేది యాప్ డెవలపర్ల మాట. అలాగే భద్రతకు గ్యారెంటీ ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement