కృష్ణపట్నం వద్ద గోల్డ్డ్రాప్ ఆయిల్ రిఫైనరీ | Lohiya group plans Rs 500 crore edible oil plant near Krishnapatnam | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం వద్ద గోల్డ్డ్రాప్ ఆయిల్ రిఫైనరీ

Nov 24 2016 1:08 AM | Updated on Sep 4 2017 8:55 PM

కొత్త ఉత్పాదనతో గ్రూప్ చైర్మన్ కన్హయ్యాలాల్ లోహియా, మహావీర్ లోహియా(ఎడమ )

కొత్త ఉత్పాదనతో గ్రూప్ చైర్మన్ కన్హయ్యాలాల్ లోహియా, మహావీర్ లోహియా(ఎడమ )

వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ రైస్ బ్రాన్ ఆరుుల్ విభాగంలోకి అడుగు పెట్టింది. గోల్డ్‌డ్రాప్ బ్రాండ్ కింద 1 లీటరు ప్యాక్‌ను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది...

కంపెనీ ఎండీ మహవీర్ లోహియా వెల్లడి 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ రైస్ బ్రాన్ ఆరుుల్ విభాగంలోకి అడుగు పెట్టింది. గోల్డ్‌డ్రాప్ బ్రాండ్ కింద 1 లీటరు ప్యాక్‌ను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది. తొలుత తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో విక్రరుుస్తామని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని లోహియా ఇండస్ట్రీస్ ఎండీ మహవీర్ లోహియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవస్థీకృత రంగంలో 55 శాతం వాటాతో గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ నూనె టాప్‌లో నిలిచిందని గుర్తు చేశారు.

రైస్ బ్రాన్ ఆరుుల్ వినియోగం పెరుగుతుండడంతో ఈ విభాగంలో ఎంట్రీ ఇచ్చామన్నారు. కంపెనీకి ప్రస్తుతం నూనెల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,300 టన్నులు ఉందన్నారు. కృష్ణపట్నం వద్ద రూ.500 కోట్లతో రోజుకు 500 టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ నెలకొల్పుతున్నట్టు తెలిపారు. స్థలం చేతిలోకి రాగానే 12-18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నూనెల విక్రయాలు 20-30 శాతం తగ్గాయని వెల్లడించారు.

Advertisement

పోల్

Advertisement