breaking news
Gold Drop brand
-
కృష్ణపట్నం వద్ద గోల్డ్‌డ్రాప్ ఆయిల్ రిఫైనరీ
కంపెనీ ఎండీ మహవీర్ లోహియా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ రైస్ బ్రాన్ ఆరుుల్ విభాగంలోకి అడుగు పెట్టింది. గోల్డ్‌డ్రాప్ బ్రాండ్ కింద 1 లీటరు ప్యాక్‌ను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది. తొలుత తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో విక్రరుుస్తామని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని లోహియా ఇండస్ట్రీస్ ఎండీ మహవీర్ లోహియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవస్థీకృత రంగంలో 55 శాతం వాటాతో గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ నూనె టాప్‌లో నిలిచిందని గుర్తు చేశారు. రైస్ బ్రాన్ ఆరుుల్ వినియోగం పెరుగుతుండడంతో ఈ విభాగంలో ఎంట్రీ ఇచ్చామన్నారు. కంపెనీకి ప్రస్తుతం నూనెల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,300 టన్నులు ఉందన్నారు. కృష్ణపట్నం వద్ద రూ.500 కోట్లతో రోజుకు 500 టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ నెలకొల్పుతున్నట్టు తెలిపారు. స్థలం చేతిలోకి రాగానే 12-18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నూనెల విక్రయాలు 20-30 శాతం తగ్గాయని వెల్లడించారు. -
కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు
రూ.500 కోట్ల పెట్టుబడి కంపెనీ ఎండీమహవీర్ లోహియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోల్డ్‌డ్రాప్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్లాంటును నెల కొల్పనుంది. మొత్తం రూ.500 కోట్లు వ్యయం చేయాలని కంపెనీ భావిస్తోంది. స్థలం చేతిలోకి రాగానే 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని లోహియా గ్రూప్ ఎండీ మహావీర్ లోహియా తెలిపారు. గోల్డ్‌డ్రాప్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త ప్యాక్‌లతో ఉత్పత్తులను కంపెనీ బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కన్హయాలాల్ లోహియా, ఇతర డెరైక్టర్లతో కలిసి మీడియాతో మా ట్లాడారు. రోజుకు 500 టన్నుల సామర్థ్యంతో కొత్త ప్లాంటు రానుందని చెప్పారు. ‘కంపెనీకి ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్లు హైదరాబాద్ వద్ద 2, కాకినాడ వద్ద ఒకటి ఉంది. వీటి సామర్థ్యం రోజుకు 1,400 టన్నులు. ముడి నూనెల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడంతో ఒప్పంద వ్యవసాయం ద్వారా పామాయిల్, పొద్దుతిరుగుడు సాగులోకి వచ్చే ఆలోచన ఉంది. 2014-15లో రూ.2,200 కోట్ల టర్నోవర్ సాధించాం. ఈ ఏడాదిలో రూ.3,000 కోట్లు ఆశిస్తున్నాం’ అని తెలిపారు. రానున్న రోజుల్లో నూనెల ధరలు పెద్దగా పెరగకపోవచ్చని అన్నారు.