
లెనోవో... ఎస్860 స్మార్ట్‌ఫోన్
చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో మరో స్మార్ట్‌ఫోన్ ‘ఎస్860’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,500.
బెంగళూరు: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో మరో స్మార్ట్‌ఫోన్ ‘ఎస్860’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,500. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 43 గంటల దాకా అత్యధిక సమయం పనిచేసే బ్యాటరీ(4000 ఎంఏహెచ్), 2జీబీ ర్యామ్ ఉంటాయి. అలాగే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 జీబీ స్టోరేజ్, డ్యూయల్ సిమ్ తదితర ఫీచర్స్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 5.3 అంగుళాల స్క్రీన్ ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని రూ. 1,999 కట్టి లెనోవో వెబ్‌సైట్లో ప్రీ-ఆర్డర్ చేయొచ్చు. లెనోవో మే 1 నుంచి షిప్పింగ్ ప్రారంభిస్తుంది.