ఐఎన్‌ఎక్స్‌ కేసు : కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్‌

Karti Chidambarams Assets Seized  In Inx Media Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేం‍ద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన సంస్థకు చెందిన భారత్‌, బ్రిటన్‌, స్పెయిన్‌లలో రూ 54 కోట్ల ఆస్తులను ఈడీ గురువారం అటాచ్‌ చేసింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు అనుగుణంగా గత ఏడాది మే 15న కార్తీని చెన్నైలో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశాల నుంచి రూ 305 కోట్ల నిధులు సమకూర్చేందుకు ఎఫ్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌ లభించేలా చేసినందుకు కార్తీ చిదంబరం రూ పది లక్షల ముడుపులు స్వీకరించారని ఆరోపించిన సీబీఐ ఆ తర్వాత ఆ మొత్తాన్ని 100 మిలియన్‌ డాలర్లుగా సవరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top