ఎయిర్‌టెల్ 30జీబీ 4 జీ డేటా అదనంగా
టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకోసం సరికొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకోసం సరికొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది. జూలై 1 ఒకటినుంచి అమలయ్యేలా "మాన్సూన్ సర్ప్రైజ్" ఆఫర్‌ను తీసుకొచ్చింది. డేటా సర్‌ప్రైజ్ కు కొనసాగింపుగా ఈ డేటా ప్లాన్లను వెల్లడించింది. వీటిల్లో మూడు నెలలపాటు అదనంగా 30జీబీ 4 జీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ. 499, రూ.649, రూ799 ప్లాన్లలో ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ప్లాన్లను ఎంపిక చేసుకున్న తమ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అదనంగా ఈ ప్రయోజనాలకు సెప్టెంబరు నెల వరకు అందించనున్నామని ఎయిర్‌టెల్ సిఇఓ గోపాల్ విఠల్ చందాదారులకు ఇమెయిల్ సమాచారంలో తెలిపారు.
ఈ ఉచిత డేటా ఆఫర్ 4జీ హ్యాండ్ సెట్లలో మాత్రమే చెల్లుతుంది. అలాగే మూడు నెలల తర్వాత ఈ ఆఫర్ ఆటోమేటిక్‌గా వెనక్కి తీసుకోబడుతుందని ఎయిర్టెల్ వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ అదనపు 30జీబీ డేటా కోసం, ప్లేస్టోర్, లేదా ఆప్ స్టోర్ నుంచి ఎయిర్ టెల్ టీవీ ఆప్ డౌన్లోడ్ చేసిన తర్వాత, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఆఫర్ను క్లెయిమ్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటికే డేటా సర్‌ప్రైజ్ ఖాతాదారులకు కూడా మూడు నెలల అదనపు డేటా వర్తిస్తుందని తెలిపింది.