స్థిరాస్తి బిల్లు.. ఆమోదం పొందేనా? | is the real estate bill received the approval ? | Sakshi
Sakshi News home page

స్థిరాస్తి బిల్లు.. ఆమోదం పొందేనా?

Aug 9 2014 4:05 AM | Updated on Sep 2 2017 11:35 AM

స్థిరాస్తి బిల్లు.. ఆమోదం పొందేనా?

స్థిరాస్తి బిల్లు.. ఆమోదం పొందేనా?

మోసపూరిత డెవలపర్ల నుంచి కొనుగోలుదారుల్ని రక్షించేందుకు...

సాక్షి, హైదరాబాద్: మోసపూరిత డెవలపర్ల నుంచి కొనుగోలుదారుల్ని రక్షించేందుకు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి కోసం ప్రత్యేక స్థిరాస్తి నియంత్రణ బిల్లును తీసుకొస్తామని ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ‘స్థిరాస్తి నియంత్రణ బిల్లు’ కొనుగోలుదారులకు వచ్చే ప్రయోజనాలపై నిపుణులు మంటున్నారంటే..
 స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలకు కళ్లెం వేయటం, స్థిరాస్తి రంగంపై ఏకరూప నియంత్రణ వ్యవ స్థ, అభివృద్ధే స్థిరాస్తి నియంత్రణ బిల్లు లక్ష్యం. జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారత దేశం అంతటా ఈ స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమలులో ఉంటుంది.

 బిల్లులో ఏముంటాయి?
{పభుత్వ విభాగాల నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే స్థిరాస్తి వ్యాపారులు తమ ప్రాజెక్టును ప్రారంభించాలి. అంతేకాకుండా పొందిన అనుమతులన్నింటినీ స్థిరాస్తి నియంత్రణ సంస్థకు సమర్పించడంతో పాటు నిర్మాణానికి ముందే వాటిని వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి.

{పాజెక్టులకు సంబంధించి వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా స్థిరాస్తి వ్యాపారిని నియంత్రించే కఠిన నిబంధనలు బిల్లులో ఉంటాయి. నిబంధనలు అతిక్రమించిన స్థిరాస్తి వ్యాపారులకు మొదటిసారి అయితే మొత్తం ప్రాజెక్టు ధరలో 10 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే తప్పు రెండోసారి చేస్తే సంబంధిత స్థిరాస్తి వ్యాపారికి మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష కూడా విధిస్తారు.

స్థిరాస్తి వ్యాపారులు, ప్రాపర్టీ డీలర్లు, ఏజెంట్లు స్థిరాస్తి నియంత్రణ సంస్థ వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. ప్రతి ప్రాజెక్టుకు ఓ ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి.  ప్రాజెక్టు కోసం సమీకరించిన నిధులను దాని కోసమే ఖర్చు చేయాలి. ఇతర ఖర్చులకు మళ్లించరాదు. నిర్మాణం చేపట్టబోయే ప్రాజెక్టును ఎంత కాలంలో పూర్తి చేస్తామనే విషయాన్ని స్థిరాస్తి వ్యాపారి ముందుగానే ఖచ్చితంగా వెల్లడించాలి. అపార్ట్‌మెంటు కార్పెట్ ఏరియా ఎంత నేది స్పష్టంగా వెల్లడించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement