నెలకు రూ.4,499 కట్టి, ఐఫోన్‌ 10ఎస్‌ పొందండి

iPhone XS Available In India At Rs. 4499 A Month - Sakshi

టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్స్‌లో ఇండియాస్టోర్‌.కామ్ ఒకటి‌. ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఆపిల్‌ ఇటీవల లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు లో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, జియో, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా వీటిని విక్రయానికి ఉంచుతుంది ఆపిల్‌. ఆసక్తి గల కస్టమర్లు ముందస్తుగా ఈ ఫోన్లను బుక్‌చేసుకోవాలని ఆపిల్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఇండియాస్టోర్‌.కామ్‌ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. 

నెలకు రూ.4,999 చొప్పున 24 నెలల పాటు చెల్లించి, ఐఫోన్‌ 10ఎస్‌(64జీబీ) వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై విధించే వడ్డీరేటు అనంతరం ఐఫోన్‌ 10ఎస్‌( జీబీ) ధర రూ.99,900 నుంచి రూ.1,07,976కు పెరుగుతుందని పేర్కొంది. అదేవిధంగా ఐఫోన్‌ 10ఎస్‌(256జీబీ) వేరియంట్‌ను కూడా 24 నెలల పాటు నెలకు రూ.5,175 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. దీనిపై విధించే వడ్డీరేటుతో కూడా ఐఫోన్‌ 10ఎస్‌(256జీబీ) వేరియంట్‌ ధర కూడా రూ.1,14,900 నుంచి రూ.1,24,200కు పెరుగుతుందని తెలిపింది. ఐఫోన్‌ 10ఎస్‌(512జీబీ) వేరియంట్‌ కూడా నెలకు రూ.6,076 చెల్లించడంతో కొనుగోలుదారులకు సొంతమవుతుంది. మిగతా మొత్తాన్ని 24 నెలల్లో చెల్లించాలి. అదేవిధంగా ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లను కూడా నెలకు 4,999 రూపాయలు, 5,678 రూపాయలు, 6,587 రూపాయలు చొప్పున 24 నెలల పాటు చెల్లించి తమ సొంతం చేసుకోవచ్చు. 

సెప్టెంబర్‌ 28 నుంచి ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌లు భారత్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్లను విడుదల చేయడానికి ఇండియాస్టోర్‌ సైట్‌ కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభించింది. 24 నెలల టెన్యూర్‌తో లో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను ఇండియాస్టోర్‌.కామ్‌ అందుబాటులోకి తెచ్చింది. వీటిపై యాక్సిస్‌బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, సిటీ క్రెడిట్‌ కార్డులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనుంది. నాన్‌-ఈఎంఐ లావాదేవీలకు ఐదింతల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లావాదేవీ జరిపిన 150 బిజినెస్‌ గంటల్లో క్యాష్‌బ్యాక్‌ కొనుగోలుదారులకు అందుతుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top